అప్పనపల్లిలోని ఎస్.బి.బి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డి-అడిక్షన్ సెంటర్, ఈగల్ డిపార్ట్మెంట్, శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత్తు వాడక మానసిక, శారీరక, చట్టపరమైన దుష్పరిణామాలు వివరించారు. లైంగిక వేధింపుల నివారణ, ఆత్మరక్షణ అంశాలపై కూడా శక్తి టీమ్స్ సూచనలు అందించారు.