అమలాపురం-ముమ్మిడివరం జాతీయ రహదారిపై శనివారం, AP40 DC 5669 నంబర్ గల ఎఫ్‌జెడ్ బైక్‌పై అతివేగంగా స్టంట్లు చేస్తూ వెళ్తున్న ఇద్దరు యువకులు ఓ వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు వెంటనే 108 వాహనంలో అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.