ఉప్పలగుప్తం గ్రామ దేవత సోమాలమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కళాకారుల కామెడీ షో నవ్వులు పూయించగా, విశాఖపట్నం ‘డీ’ గ్రూప్ కళాకారుల నృత్య ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శనలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఉప్పలగుప్తంలో కోలాహలం నెలకొంది.