గాంధీజీ 78వ వర్ధంతి: అమలాపురంలో ఘన నివాళి

అమలాపురం శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పచ్చిగోళ్ళ జనార్ధనరావు కళ్యాణ మండపం వద్ద, గాంధీ సెంటరులో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఉద్యమాలు, త్యాగాలను వివరించారు. సంఘ గౌరవ అధ్యక్షులు యెండూరి వేంకట్రామయ్య, అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి నంబూరి నరేష్, కోశాధికారి కొమ్మూరి వెంకటచల ప్రసాద్, సుబ్బాలమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్నతో పాటు పలువురు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్