హైదరాబాద్ టూ అమలాపురం.. మార్గమధ్యలో ప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో పశ్చిమ బైపాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్