ఉపాధి కోసం కువైట్ వెళ్లి, అనుకోని పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన జాల లక్ష్మిని, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నేతృత్వంలోని వలసదారుల కేంద్రం ప్రత్యేక చొరవతో క్షేమంగా స్వదేశానికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్య జాల లక్ష్మిని గల్ఫ్ దేశాలకు పంపిన భర్త సురేష్, పరిచయస్తుల ద్వారా ఆమెను జూన్ 2024లో కువైట్ పంపారు. అక్కడ ఒక చిన్న పాప సంరక్షణ బాధ్యతలు చూస్తున్నప్పుడు, పాప చికిత్స నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లగా, అక్కడే జాల లక్ష్మిని ఉంచేశారు. సరైన వసతి, భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను, భారత దౌత్య కార్యాలయం సలహాతో వలసదారుల కేంద్రం జోక్యం చేసుకుని, భారత రాయబార కార్యాలయం, ఏజెంట్లతో సమన్వయం చేసి హైదరాబాద్‌లోని భర్త వద్దకు చేర్చింది. ఈ ప్రక్రియలో వలసదారుల కేంద్రం సిబ్బంది కే సత్తిబాబు, సఫియా దుర్గ కీలక పాత్ర పోషించారు.