అమలాపురంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు

అమలాపురంలోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 38 ఏళ్లుగా జేవీవీ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలపై నిరంతరం పోరాడుతూ ప్రజలను చైతన్యపరచడంలో జేవీవీ పాత్ర ఎంతో అభినందనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్