కోనసీమ: ప్రభుత్వ ఆదేశాలతో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ

జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా భద్రతా పింఛన్ల పంపిణీ ద్వారా పేద, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించి, జీవనోపాధికి అండగా నిలవాలని తెలిపారు. బుధవారం నూతన సంవత్సరానికి ముందే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం, చల్లపల్లి గ్రామాలకు చెందిన పలువురికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆనంద రావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. దీని ద్వారా ప్రజలు చిరునవ్వులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సంబంధిత పోస్ట్