అమలాపురంలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో భక్తుల ఆనందం

అమలాపురంలోని మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా, శ్రీ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, అమలాపురం శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనను అద్భుతంగా అందించింది. ఈ ప్రదర్శనను భక్తులు ఎంతో ప్రశంసించారు. ఆలయ చైర్మన్ కంచపల్లి అబ్బులు, ఈవో సత్య కుమార్ చిన్నారులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు. ఈ నృత్య ప్రదర్శన స్వామి సన్నిధిలో జరిగింది.

సంబంధిత పోస్ట్