అమలాపురం మండలంలో ముమ్మరంగా పూడికతీత పనులు

అమలాపురం మండలంలోని 22 గ్రామాల్లో రూ. 19 లక్షల వ్యయంతో 26 సాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద పంట కాలువలు, బోదుల్లో పూడిక, తుప్పలను తొలగిస్తున్నారు. ఈ పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీవో శీను బాబు గురువారం తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్