అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం మహాత్మా గాంధీ 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పరిపాలనాధికారి కె. కాశీ విశ్వేశ్వరరావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, త్యాగం వంటి విలువలతో గాంధీజీ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారని, ఆయన ఆశయాలైన గ్రామీణ స్వరాజ్యం, సమానత్వం సాధనకు కోనసీమ జిల్లా ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలను జీవితంలో అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.