అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అధికారికంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన డీఆర్వో వి. సుబ్బారావు, రూ. 2 కే కిలో బియ్యం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, మండల వ్యవస్థ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ సంక్షేమ పాలనకు నాంది పలికారని కొనియాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సూపరింటెండెంట్ సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.