మత్తు పదార్థాలపై కూలీలకు అవగాహన కల్పించిన అధికారులు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం, కరక్కాయపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక మరియు మానసిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు మరియు సంబంధిత సెక్షన్ల గురించి కూడా వివరించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి, డి-అడిక్షన్ సెంటర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, కౌన్సిలర్ శ్రీనిధి, ఈగల్ పోలీస్ విభాగానికి చెందిన రఘు, సత్య పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో జరిగింది.

సంబంధిత పోస్ట్