కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేట్

రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల (ISO) సర్టిఫికేట్ కోసం ఎంపికయ్యాయి. కోనసీమ జిల్లా, అమలాపురం మండలం, కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఈ ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేట్ లభించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మిని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, సర్పంచ్ బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ISO సర్టిఫికేట్ లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్