కోనసీమ జిల్లాలో 196 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 34,900 మంది రైతుల నుండి 2,82,110 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నదియాదేవి ఆదివారం తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి రూ. 665.28 కోట్లకు గాను, రూ. 620.11 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన నిధుల్లో రూ. 23.25 కోట్ల చెల్లింపునకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 16వ తేదీతో మూసివేయనున్నారు.