రావులపాలెం మండలం ఈతకోట సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఈతకోట ఇండస్ట్రియల్ ఫీడర్‌పై చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని ఈ ఫీడర్ పరిధిలోని పరిశ్రమలన్నింటికీ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించాలని కోరారు.