ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలోని వేదాంత ప్లాంట్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు. ప్లాంట్ ఏర్పాటు సమయంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని, తక్షణమే 50 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వీడాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనకు గ్రామస్థులు కూడా మద్దతు తెలిపారు.