బోడసకుర్రు టిడ్కో గృహాల్లో వివాహిత అనుమానాస్పద మృతి

అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో లేఅవుట్‌లో శనివారం పరమట రామలక్ష్మి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త శ్రీనుపై బలమైన అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్