నిరుపేద కుటుంబాలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడమే 'పీ-4' పథకం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఆర్థిక సహాయంతోనే పేదరికం తొలగిపోదని, వారి జీవన విధానంలో స్థిరమైన మార్పు రావాలని స్పష్టం చేశారు. 'మార్గదర్శి కుటుంబం 10-20' లక్ష్యంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేదరికంపై సమగ్ర పోరాటం చేస్తున్నామని, పేద కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.