అల్లూరి ఆశయ సాధనే లక్ష్యం కావాలి: కోనసీమ జేసీ

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలు అధికారికంగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ నిధియాదేవి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి చరిత్ర ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, అడవి బిడ్డల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం అనన్యసామాన్యమని ఆమె అన్నారు. నేటి తరం యువత ఆయన దేశభక్తి, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వి. సుబ్బారావు, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్