సమనసలో విషాదం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న గుద్దటి కాశీవిశ్వేశ్వరరావు (42) బుధవారం తన స్వగ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఇంటి పని నిమిత్తం మోటార్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యారు. 108 సిబ్బంది వచ్చేలోపే ఆయన మరణించగా, మృతదేహాన్ని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్