అనపర్తి మండలం పేరా రామచంద్రపురంకి చెందిన పెనుమర్తి బుజ్జిబాబు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. విజయనగరం జిల్లా గురజాడలోని జేఎన్టీయూ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన పెనుమర్తి బుచ్చిబాబుకు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు రిజిస్టర్ ప్రొఫెసర్ జయసుమ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.