అనపర్తి: రైలు నుంచి జారిపడి వ్యాపారికి తీవ్రగాయాలు

శుక్రవారం తెల్లవారుజామున అనపర్తి శివారులో రైలు నుంచి జారిపడిన ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మహేంద్రవాడ గ్రామానికి చెందిన సీహెచ్. దుర్గా రెడ్డి వ్యాపార నిమిత్తం విజయనగరం వెళ్లి, స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అనపర్తి సమీపంలో రైలు గేటు వద్ద నిలబడగా అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లు రైలు చక్రాల కిందకు వెళ్లి నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్