అనపర్తి: 'జగన్ పేదల కడుపు కొట్టారు'

మునుపటి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అనపర్తిలో శుక్రవారం కొత్త వితంతు పింఛన్ల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ.5కే అన్నం పెడుతూ రోజూ 2.5 లక్షల మందికి ఆహారం అందిస్తోందని చెప్పారు. మొదటి ఏడాదిలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ ప్రారంభమవుతందని తెలిపారు.

సంబంధిత పోస్ట్