అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతుల సమస్యలను ప్రస్తావించారు. రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రసాయనిక సేద్యం వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.