రామవరంలో మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమం

అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్థాపక సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కుటుంబ సభ్యులు మూలారెడ్డి విగ్రహానికి పూలు నివాళులర్పించారు. నియోజవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్