రంగంపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో వివిధ ఎక్సైజ్ నేరాలతో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలను గురువారం బహిరంగ వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ డి. సుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఆర్టీవో నిర్ణయించిన ధరపై ఈ వేలం నిర్వహించబడుతుంది. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.