బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర షిర్డీ సాయి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్బంగా సాయి బాబా వారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.