వేసవి సెలవుల్లో పిల్లల క్రికెట్ టోర్నమెంట్: విశేష స్పందన

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో వేసవి సెలవుల సందర్భంగా ఆదివారం పిల్లల కోసం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచే లక్ష్యంతో జరిగిన ఈ పోటీలను మాజీ కౌన్సిలర్ చీర వెంకటరమణ ప్రారంభించారు. విజేతలు, రన్నరప్స్, బెస్ట్ ప్లేయర్లకు టీచర్ సరిత తన సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు. బ్రిడ్జిపేట కాలనీ పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్