పందలపాకలో పరుగులు పెడుతున్న అభివృద్ధి

తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో గత 20 నెలలుగా రూ. 1.65 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డు, 15 సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన 16 ఎకరాల కాలనీని సిమెంట్ రోడ్ల కాలనీగా తీర్చిదిద్దే పనులు చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో రెండు గోకులం షెడ్ల నిర్మాణం కూడా పూర్తి కావడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పందలపాకలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్