అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ఆరు నెలల చిన్నారి సిద్ధార్థ వీరన్ అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్య సహాయం కోసం విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించి నియోజకవర్గంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు విరాళాలు అందజేస్తున్నారు. శనివారం రామవరంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యాపారవేత్తలు సుమారు లక్ష రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సమక్షంలో బాధిత కుటుంబానికి అందించారు.