అనపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ చారిటీస్ మహిళా వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు వలివర్తి కృష్ణంరాజు జ్ఞాపకార్థం వృద్ధ మహిళలకు భోజనాలు పంపిణీ చేశారు. ఆదివారం కృష్ణంరాజు కుమార్తె వలివర్తి లక్ష్మి ప్రవీణ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వలివర్తి శివ పార్వతి, గొట్టుముక్కల వెంకట నరసరాజు, అందే హర్షిక, అందే శ్రీ కంఠ సత్య హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.