డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణంలో వెలసిన సుబ్రమణ్య స్వామి గుడికి మాజీ మున్సిపాలిటీ చైర్మన్ యాళ్ళ సతీష్ రూ. 12 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ కమిటీ డైరెక్టర్ చిట్టూరి రాజేశ్వరి, ఏవో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీహరి సమక్షంలో నాగార్జున గారి చేతుల మీదుగా ఆలయం పేరున డిపాజిట్ చేయవలసిందిగా కోరుతూ అందజేయడం జరిగింది. ఈ సంఘటన అమలాపురంలో జరిగింది.