బిక్కవోలు ఆసుపత్రి ప్రహరీ గోడపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేసిన ఆరోపణలను కూటమి నాయకులు శ్రీనివాస్, చిట్టిబాబు చౌదరి ఖండించారు. శనివారం అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద వారు మాట్లాడుతూ అసత్యాలు చెప్పడం మానేసి, ఆరోపణలను ఆసుపత్రి వద్దకు వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.