తూ. గో జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 19 నుండి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థుల కోసం ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.