చిన్నారి ప్రాణం కాపాడదాం: MLA నల్లమిల్లి

రామవరంలోని పొలమూరుకి చెందిన సిద్దాత్ వీరన్ అనే చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని వైద్యానికి రూ. 35 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన రూ. 8 లక్షల చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే సొంతంగా రూ. 1 లక్ష సహాయం చేస్తానని, మిగతా మొత్తానికి దాతల సహాయం కోరారు.

సంబంధిత పోస్ట్