దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ

అనపర్తి గాంధీ బొమ్మ సెంటర్ లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అహింస, సత్యం ఆయుధాలుగా బ్రిటిష్ వారిని ఎదిరించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. గాంధీజీ చూపిన శాంతి మార్గం, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్