అనపర్తి బస్టాండ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నిధులతో ఈ నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు.