రాజమండ్రిలోని తూ. గో జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం "జనతా వారధి" (మీ సమస్య - మా బాధ్యత) కార్యక్రమం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.