తూ. గో జిల్లాలో అమలు జరుగుతున్న పిఎంఏవై 2. 0 పథకం కింద మంజూరు చేసిన గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిడి (హౌసింగ్) నాతి బుజ్జి గురువారం సూచించారు. జిల్లా వ్యాప్తంగా పిఎంఏవై 2. 0 పథకం కింద మొత్తం 696 ఇళ్లకు మంజూరు లభించగా, నిడదవోలు అర్బన్ పరిధిలో 113 ఇళ్లకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.