బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి గ్రామంలో గురువారం జలజీవన్ మిషన్ పథకం కింద రూ. 27.60 లక్షల వ్యయంతో నిర్మించబోయే వాటర్ ట్యాంకు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.