అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శుక్రవారం అనపర్తి మండలం రామవరంలో మాట్లాడుతూ, తిరుమల లడ్డూలో కల్తీకి పాల్పడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికలో రసాయనాలతో కృత్రిమంగా నెయ్యిని తయారుచేసి లడ్డు తయారీలో ఉపయోగించారని పేర్కొన్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు కల్తీ జరగలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.