తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో శుక్రవారం, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మేజర్ డ్రెయిన్ బండి రేవు వద్ద డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కాలువల్లో పెరిగిన కలుపు మొక్కలను నిర్మూలించి, సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, డీసీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ చర్య నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టారు.