మాకనపాలెంలో వైభవంగా సత్యనారాయణ స్వామి ఊరేగింపు

మాకనపాలెంలో శ్రీ అనంతలక్ష్మి భూదేవి సమేత సత్యనారాయణ స్వామివారి 74వ వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారు సర్వాంగ సుందరంగా అలంకరించిన సర్ప వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, వ్రతాలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. వేడుకల అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్