అయినవిల్లి మండలంలోని తొత్తరాముడి గ్రామంలో ఆదివారం మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి జోహార్లు అర్పించారు. పి. గన్నవరం నియోజకవర్గ MSP అధ్యక్షులు కొల్లి శ్రీను మాదిగ, కె. జగన్నాధపురం ఉప సర్పంచ్ ఆకుమర్తి దుర్గారావు, అయినవిల్లి మండల MRPS అధ్యక్షులు ముమ్మిడివరపు రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత జాతి హక్కుల కోసం పోరాడిన వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నేదునూరి గాంధీ, కొడమంచిలి దుర్గా ప్రసాద్, నవుండ్రు వంశీ తదితర నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.