అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని సుందర రావు అనే వ్యక్తి ఇంట్లో గోధుమ త్రాచు పాము ప్రవేశించింది. దీంతో ఇంట్లో సభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వర్మ పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఇటీవల కాలంలో పాముకాటుతో మృతి చెందిన సంఘటనలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.