ఏలూరు రేంజ్ ఐజీ జి. వి. జి. అశోక్ కుమార్ బుధవారం అయినవిల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. జిల్లాలో క్రైమ్ రేట్, గంజాయి కేసులు తగ్గాయని ఆయన తెలిపారు. జాతరల సమయంలో యువత ఘర్షణలకు, మద్యం మత్తులో బైక్ రేసింగ్‌లకు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని, యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.