అయినవిల్లి మండలం వీరవల్లి పాలెం గ్రామంలో సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై సోమవారం అధికారులు కళాకారులచే కళాజాత నిర్వహించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ వినూత్న ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనిచేశారు.