అయినవిల్లి లంక: పాడైపోయి ప్రమాదకరంగా మారిన ఫ్యుజ్ బాక్స్

అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో విద్యుత్ స్తంభానికి అమర్చిన ఫ్యుజ్ బాక్స్ పాడైపోయి ప్రమాదకరంగా మారింది. స్థానికుడు కోడూరి రామచంద్రరావు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా ఈ సమస్య ఉందని, ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో గడ్డి ట్రాక్టర్లు, స్కూలుకు వెళ్లే చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్