అంబాజీపేటలో గురువారం జరిగిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ మద్దతుదారుల ఓట్లను అక్రమంగా తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, అర్హులైన వారి ఓట్లను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. దొంగ ఓట్లకు అవకాశం లేకుండా బూత్ స్థాయి అధికారులు (BLOs) సమర్థవంతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఓటు తొలగించినా పార్టీ పరంగా గట్టిగా నిలదీస్తామని, బాధ్యులపై చట్టపరంగా న్యాయపోరాటం చేస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు.